టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ.. పాత పోస్ట్ వైరల్?

praveen
ఇటీవలే భారత క్రికెట్ లో ఎప్పుడూ ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి అన్నది తెలిసిందే. నిన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇక ఇటీవల మూడు ఫార్మాట్ల నుండి తప్పుకున్నాడు  అంతేకాకుండా మొన్నటి వరకు టీమిండియాకు హెడ్ కోచ్  గా కొనసాగిన రావిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఇక పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇక టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ గా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వచ్చాడు. ఇలా టీమిండియాకు కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మ కొత్త హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ రావడంతో ఇక భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది అని చెప్పాలి.



 అయితే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత బిసీసీఐ అతని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది. ఇది కాస్త చిన్నపాటి వివాదంగా మారి పోయింది.. మొన్నటికి మొన్న సౌత్ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే  ఇక విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కొత్త కెప్టెన్ ఎవరు అనే చర్చ జరగ్గా ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్గా ఉన్న రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ సారథ్యం బాధితులను ఆదుకున్నాడూ. ఈ క్రమంలోనే దాదాపు మూడేళ్ల కిందట ఇండియా సారథి రోహిత్ శర్మ చేసిన ఒక పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 2018 సెప్టెంబర్ 1వ తేదీన అతను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మీ ఫేవరెట్ కొటేషన్ ఏంటి అభిమానులు ప్రశ్నించగా.. నన్ను ఎంత అణిచి వేస్తే అంత పైకి తిరిగి వస్తాను అంటూ రోహిత్ బదులిచ్చాడు. ఇక ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు కూడా రోహిత్ శర్మ అందుకోవడంతో ఇక అభిమానులు రోహిత్ శర్మ చెప్పిందే చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. టెస్ట్ ఫార్మట్ కి పనికి రాడు అంటూ రోహిత్ పై విమర్శలు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం అదే ఫార్మాట్ కూ రోహిత్ శర్మ కెప్టెన్ గా అవతరించాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: