అద్భుత శతకం.. ఇక ఇతను టీమిండియా లోకి వచ్చినట్లే?

praveen
దాదాపు రెండేళ్ల పాటు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న రంజీ ట్రోఫీ ప్రస్తుతం జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. రంజి ట్రోఫీలో భాగంగా ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి వరకు టీమిండియా లో కొనసాగి పేలవా ప్రదర్శన కారణంగా చోటు కోల్పోయిన ఎంత మంది ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో రాణించి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ఎంతో మంది ఆటగాళ్లు వరుసగా సెంచరీలతో చెలరేగిన పోతూ ఉండటం గమనార్హం.

 ముఖ్యంగా ఇటీవలే అజింక్యా రహానే పేలవమైన ప్రాంతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా సెంచరీ  చేసి అదరగొట్టాడు. అయితే ప్రస్తుతం టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా పేరుతెచ్చుకున్నాడు హనుమ విహారి. కానీ గత కొంత కాలం నుంచి టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేక  ఇబ్బందులు పడుతున్నాడూ. అప్పుడప్పుడు వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు  తెలుగు క్రికెటర్ హనుమాన్ విహారి. అయితే ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగంగా మళ్లీ అద్భుతమైన ప్రదర్శన చేసి ఇండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న హనుమ విహారి ఇక ఇటీవల మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

 సెంచరీతో చెలరేగిన పోయాడు  ఇటీవలే గ్రూప్ బి లో భాగంగా చండీగఢ్ తో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో 59 పరుగులతో రాణించిన హనుమ విహారి రెండవ ఇన్నింగ్స్ లో 149వ బంతుల్లో 15 ఫోర్ల సహాయంతో 106 పరుగులు చేశాడు. దీంతో ఇక హనుమ విహారి అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు. ఇకపోతే ఇటీవల చాలా రోజుల తర్వాత హనుమ విహారి ఐపీఎల్ మెగా వేలంలో 1.70 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది అనే విషయం తెల్సిందే. ఇక మరోవైపు తిలక్ వర్మ సైతం 76 బంతుల్లో 63 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇతను కూడా ముంబై ఇండియన్స్ లో ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: