నా జీవితంలో ఇదే బెస్ట్ సర్ ప్రైస్ : మహమ్మద్ సిరాజ్
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక ఆటగాడిగా మారిపోయిన మహమ్మద్ సిరాజ్ ను ఇటీవలే ఏడు కోట్లతో రిటైన్ చేసుకుంది బెంగళూరు జట్టు యాజమాన్యం. ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన సిరాజ్.. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ తనను సర్ప్రైజ్ చేసి షాకిచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. బెంగళూరు జట్టులోని ప్రతి ఆటగాడిని ఓ రోజు మా ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించాను.. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ భయ్యా దగ్గరికి వెళ్లి పిలిచాను.
నాకు వెన్ను నొప్పి ఉంది.. నేను మీ ఇంటికి రాలేను అంటూ విరాట్ కోహ్లీ చెప్పాడు. సరే విశ్రాంతి తీసుకో భయ్యా అని చెప్పాను. అంతకంటే నేనేం చేయగలను. ఆ తర్వాత ఒక్కొక్కరుగా మా ఇంట్లోకి వచ్చారు.. అంతలో కోహ్లీ భయ్యా కార్ దిగటం చూసి ఆనందంతో ఊగిపోయా. వెంటనే వెళ్లి కోహ్లీ భయ్యా ను గట్టిగా హత్తుకున్నాను. నా జీవితంలో బెస్ట్ సర్ప్రైస్ అంటే ఇదే. ఎందుకంటే కోహ్లీ భయ్యా వెన్నునొప్పి ఉందిరాలేను అని చెప్పాడు కదా.. ఇక రాలేను అని చెప్పి రావడంతో ఎంతో ఆనంద పడి పోయాను అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ టోలిచౌకి కి వచ్చాడు అన్న విషయం పెద్ద వార్తగా మారిపోయింది అంటూ సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు.