రోహిత్ అసహనం.. కోహ్లీ సలహా బెడిసికొట్టింది?

praveen
రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తూ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు రోహిత్ శర్మ. అదే సమయంలో ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎప్పుడు రివ్యూ కి వెళ్ళినా మంచి ఫలితాన్ని సాధిస్తున్నాడు. దీంతో రోహిత్కు రివ్యూ రారాజు అని అభిమానులు పేరు కూడా పెట్టేస్తున్నారు. ఇకపోతే ఇటీవల జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో మరోసారి రివ్యూ విషయంలో మాజీ కెప్టెన్ కోహ్లి సలహా తీసుకున్నాడు రోహిత్.



 ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం కాస్త వివరాల్లోకి వెళ్ళాల్సిందే..  డెబ్యూ బౌలర్ రవి బిష్ణయ్ మొదటి మ్యాచ్లో అదరగొట్టాడు. అద్భుతమైన బంతులు సంధిస్తూ వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇకపోతే ఇన్నింగ్స్ 8 ఓవర్లో రవి విష్ణు వేసిన బంతి రోస్టన్ చేజ్ ను తాకుతూ కీపర్ రిషబ్ పంత్ చేతుల్లో పడింది. ఈ క్రమంలోనే కీపర్ రిషబ్ పంత్, బౌలర్ రవి అప్పీల్  చేశారు. అయితే అటు ఫీల్డ్ అంపైర్ మాత్రం అది వైడ్ బాల్ అంటూ ప్రకటించాడు. దీంతో అది వైడ్ బాల్ ఏంటి అంటూ అంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు రోహిత్. ఇంతలో కోహ్లి అక్కడకు వెళ్లగా.. రివ్యూ కి వెళ్లాలా వద్దా అని కోహ్లీని అడిగాడు.  అయితే బంతి బ్యాట్ తాకినట్లు సౌండ్ వచ్చింది పట్టు కోహ్లీ చెప్పడంతో అతనిపై ఉన్న నమ్మకంతో రివ్యూ వెళ్లాడు రోహిత్ శర్మ.




 ఇక థర్డ్ అంపైర్ రివ్యూ లో పెద్ద స్క్రీన్ లో మరోసారి చెక్ చేయగా బంతి బ్యాట్ కి ఎక్కడ తగిలినట్లు కనిపించలేదు. దీంతో బ్యాట్స్ మెన్ ను  నాటౌట్గా ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్. అయితే కోహ్లీ రోహిత్ రిషబ్ పంత్ లను చూస్తూ పాయె రువ్యూ పాయె అంటూ కోహ్లీ అనడంతో వారి మొహాల్లో నవ్వులు విరిశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ విమర్శలు వస్తున్నాయి.. ఇలాంటి విమర్శల నేపథ్యంలో ఇటీవల కాలంలో రివ్యూ కోసం రోహిత్ శర్మ కోహ్లీ సలహా తీసుకుంటూ ఉండటం చూస్తుంటే వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అర్థమవుతోంది. ఇకపోతే ఇటీవల కోహ్లీ ఇచ్చిన సలహా బెడిసికొట్టడంతో రోహిత్ అభిమానులు నిరాశ పడతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: