టీమిండియా లోకి సూపర్ ఎంట్రీ.. 24 బంతుల్లో?

praveen
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా అరంగేట్రం చేసిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతంగా రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సూపర్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు యువ ఆటగాళ్లు. ఇకపోతే ప్రస్తుతం ఇండియా వెస్టిండీస్ లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా టి20 సిరీస్ ఆడుతుతుంది. అయితే ఈ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇండియా.


 అయితే ఈ మొదటి టీ20 మ్యాచ్ లో రవి బిష్ణయ్  అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇక భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా నిలిచాడు రవి బిష్ణయ్.  క్రికెట్ లో మొదటి మ్యాచ్ అయినప్పటికీ ఎక్కడ ఒత్తిడి లేకుండా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్లను  తన బౌలింగ్లో ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతని బౌలింగ్లో కేవలం వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు ఒకే ఒక్క ఫోర్ కొట్టారు అంటే తన బౌలింగ్ తో ఎంత ఇబ్బంది పెట్టాడు అర్థం చేసుకోవచ్చు. 24 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు రవి బిష్ణయ్. అంతే కాదు ఇందులో 17 డాట్ బాల్స్ వుండడం గమనార్హం.



 కానీ ఆరు వైడ్ బాల్స్  వేసి కాస్త నిరాశ పరిచాడు ఈ యువ ఆటగాడు. కానీ ఓవరాల్గా పర్ఫామెన్స్ చూసుకుంటే మాత్రం మొదటి మ్యాచ్లో ఇరగదీశాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత టీ20 లో కూడా ఇతన్నే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ కు చెందిన రవి బిష్ణయ్ 42 దేశవాళీ  ఆడి 6.6 మూడు ఎకానామీ తో 49 వికెట్లు పడగొట్టాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ లో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న మొదటి ఆటగాడిగా గుర్తింపు సంపాదించాడు. ఇక ఇతని ప్రదర్శన పై అటు సీనియర్లు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: