ఐపీఎల్ : నన్ను తీసుకోలేదు సరే.. అతని కూడానా?

praveen
ఇటీవలే బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా వేలం నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ మెగా వేలం కొంతమంది ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తే మరికొంతమందిని మాత్రం నిరాశపరిచింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు కోట్లకి కోట్లు కొల్లగొడితే.. అటు ప్రపంచ క్రికెట్లో స్టార్లుగా వెలుగుతున్న వారిని మాత్రం ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదూ. చివరికి తిరుగు ప్రయాణం అయ్యే  పరిస్థితి వచ్చింది. ఐపీఎల్ మెగా వేలంలో 217 స్థానాలకు 10 ఫ్రాంచైజీలు క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 204 మందితో మాత్రమే సరిపెట్టుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఐపీఎల్లో సీనియర్ లుగా.. స్టార్లుగా కొనసాగుతున్న సురేష్ రైనా,షకీబ్ ఉల్ హాసన్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్ తదితర ప్లేయర్లు అన్ సొల్డ్ గా మిగిలిపోయారు.



 అయితే ఇలా ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయని ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆడం జంపా, కెన్ రిచర్డ్ సన్  కూడా ఉన్నారు. అయితే గత సీజన్లో ఈ ఇద్దరు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు ఆటగాళ్లు మెగా వేలంలో అమ్ముడు పోకుండా మిగిలిపోవడం పై ఇటీవలె స్టార్ ప్లేయర్ కెన్ రిచర్డ్సన్ స్పందించాడు.  ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన ఈ ఆటగాడు నిజంగా ఆడం జంపా ను ఎవరు కొనలేదు అంటే నేను విస్మయానికి గురయ్యా.



 వాస్తవానికి చెప్పాలంటే నిజాయితీగా మాట్లాడుకుంటే మేము గత సీజన్ మధ్యలోనే లీగ్ నుంచి వైదొలిగాము. ఈ విషయం గురించి  సంభాషించే క్రమంలో ఇందుకు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని ఆడం జంపా కు చెప్పాను. అయితే గత సీజన్లో లో మాత్రం ఐపీఎల్ వదిలి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోవడమే అత్యంత ప్రాధాన్యం అయింది. అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది   ఇక మెగా వేలంలో ఫ్రాంచైజీలు మమ్మల్ని కొనుగోలు చేయకపోవడానికి మాపై ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణం అయి ఉండవచ్చు.. అదేవిధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల గత రెండు సీజన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేక పోయాను అంటూ కేన్ రిచర్డ్సన్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: