ధోని ప్లాన్ మార్చాడు.. ఈసారి కొత్తగా?
ఇలా ఐపీఎల్ లో పాల్గొని అన్ని జట్లలో యువ ఆటగాళ్లు ఉంటే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ లో మాత్రం కేవలం సీనియర్ ఆటగాళ్లు మాత్రమే మొన్నటివరకు కనిపించేవారు. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ కు డాడీ ఆర్మీ అనే పేరు ఉండేది. డాడీస్ ఆర్మీ పేరు ఉన్నప్పటికీ టైటిల్ విజేత గా నిలుస్తూ అందరినీ షాక్ కి గురిచేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే మొన్నటి వరకు కేవలం సీనియర్ ఆటగాళ్ల తోనే ముందుకు నడిచినా చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు మాత్రం యువ ఆటగాళ్లను జట్టులో చేర్చుకుంది.
ఈ సారి అనుభవం ఉన్న ఆటగాళ్ల కంటే యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఇటీవల జరిగిన మెగా వేలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు ను సొంతం చేసుకుంది అనే చెప్పాలి. అయితే మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఉన్న 25 మంది ఆటగాళ్లలో ఎనిమిది మంది మినహా మిగతా అందరు కూడా 30 ఏళ్లు దాటని వారే ఉన్నారు అని చెప్పాలి. ఇక యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంలో కీలక పాత్ర వహించిన మహేంద్రసింగ్ ధోని.. ఇలా అనుభవం లేని ఆటగాళ్లతో జట్టును ఎలా ముందుకు నడిపించబోతున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.