మెగా వేలం.. తెలుగు ప్లేయర్ కు లక్కీ ఛాన్స్?
ప్రతి ఏడాది ఐపీఎల్ లో కొత్త ఆటగాళ్లు సత్తా చాటు తుంటారు. ఇక తర్వాత భారత జట్టు లో చోటు దక్కించు కోవడం చేస్తున్నారు. అయితే ఐపీఎల్ మెగా వేలం జరిగినప్పుడల్లా తెలుగు ఆటగాళ్లు ఎంత మంది సెలక్ట్ అవుతారు.. ఎంత ధర కి ఫ్రాంచైజీ లు వారిని కొనుగోలు చేశాయి. తెల్సు కోవటానికి ఆసక్తి చూపుతారు తెలుగు క్రికెట్ ప్రేక్షకులందరూ. ఇక ఇప్పుడు మెగా వేలం నేపథ్యం లో తెలుగు ఆటగాళ్లు ఐపీఎల్లో చోటు దక్కించు కోవాలని కోరుకున్నారు.
ఈ క్రమంలోనే ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు ఆటగాళ్లు కూడా సత్తా చాటారు అన్నది తెలుస్తుంది. మెగా వేలంలో తెలుగు ప్లేయర్ ఎంపికయ్యాడు. నెల్లూరు జిల్లాకు చెందిన అశ్విని హెబ్బార్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 లక్షలకు కొనుగోలు చేయడం గమనార్హం. ఇతను 2015 నుంచి రంజీల్లో ఆంధ్ర టీం తరఫున ఆడుతున్నాడు. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కూడా 2017 నుంచి 2019 వరకు వరుసగా ఆడుతున్నాడు. తన అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. ఇక అంతర్జాతీయ జట్టులో ఆడటమే తన లక్ష్యం అంటూ చెబుతున్నాడు ఈ 26 ఏళ్ల ఆటగాడు.