మెగా వేలం.. సన్రైజర్స్ తీసుకున్న ఆటగాళ్లు వీళ్లే?
అంతేకాదు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంత సమయంలోనే ఏకంగా ఒక సారి టైటిల్ కూడా అందుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఇటీవలే మెగా వేలం నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి ఆటగాళ్లను తీసుకొని తమ జుట్టును పటిష్టంగా మార్చుకుంటుంది అనేదానిపై అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎంతో మంది యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ప్లేయర్లను కూడా జట్టులోకి తీసుకున్నారు అన్నది తెలుస్తుంది.
ఇక నిన్న జరిగిన మెగా వేలం లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఎవరిని తీసుకుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నీకోలాస్ పూరన్ 10.75 కోట్లు చెల్లించి సన్రైజర్స్ సొంతం చేసుకుంది ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాషింగ్టన్ సుందర్ కు 8.75 కోట్లు చెల్లించింది. ఇక గత ఏడాది అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్న రాహుల్ త్రిపాఠిని 8.50 కోట్లకు సొంతం చేసుకుంది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ కు 6.50 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. సన్రైజర్స్ రెగ్యులర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు 4.2 కోట్లు.. యార్కర్ కింగ్ గా పేరు తెచ్చుకున్న నటరాజన్ కు 4 కోట్లు.. కార్తీక్ త్యాగి కి 4 కోట్లు.. ఎస్ గోపాల్ కి 75 లక్షలు సుచిత్ 20 లక్షలు. ప్రియం గార్గ్ 20 లక్షలకు సొంతం చేసుకుంది సన్రైజర్స్.