మెగా వేలం.. అతను కావాలంటే ధోనికి తిప్పలు తప్పవు?

praveen
ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలోనే ఒకవైపు క్రికెట్ ఆటగాళ్లతో పాటు మరోవైపు అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగుళూరు వేదిక ఈ మెగా యాక్షన్ షురూ కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఏకంగా ఐదు వందల తొంభై మంది ఆటగాళ్లు ఈ మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో 370 మంది భారత ఆటగాళ్లు ఉండగా 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఐపీఎల్ మెగా వేలానికి ముందు ప్రతి జట్టు గరిష్ఠంగా కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.



 ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా నలుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకున్నాయి. మిగతా ఆటగాళ్లను అటు ఐపీఎల్ మెగా వేలంలోకి వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చాయ్. ఇక కొన్ని జట్లు ఐపీఎల్ మెగా వేలంలోకి వదిలేసిన ఆటగాళ్ళను  మళ్ళీ ఇప్పుడు తీసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేయగా మరికొన్ని జట్లు కొత్త ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో ఐపీఎల్ మెగా వేలంలో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉండటం గమనార్హం   దీంతో ఈసారి మెగా వేలంలో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉందని గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది  అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన పాప్ డూప్లెసిస్ ను రిటైన్ చేసుకోలేదు  యాజమాన్యం.



  ఈ విషయంపై ఇటీవలే భారత స్పిన్నర్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డూ ప్లేసెస్ ను తిరిగి దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. చెన్నై జట్టు ఛాంపియన్ గా నిలవడం లో అతని పాత్ర ఎంతో కీలకంగా ఉందని చెప్పుకొచ్చాడు. గత సీజన్లో అతన్ని 1.5 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఈ సారి మాత్రం తీవ్రమైన పోటీ మధ్య భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. మెగా వేలంలో అతడికి మంచి డిమాండ్ ఉందని ఎన్నో ఫ్రాంచైజీలు అతని కోసం పోటీ పడే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: