సాధారణంగా క్రికెట్లో ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు మరో దేశం పర్యటనకు వెళ్లి ద్వైపాక్షిక సిరీస్లు ఆడుతూ ఉండటం చూస్తూ ఉంటాం. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో కాస్త కఠిన పరిస్థితుల మధ్య ఇతర దేశాల పర్యటనకు వెళ్లిన ఆటగాళ్లు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇక ఇతర దేశాల్లో సిరీస్ ముగిసింది అంటే ఎంతో ఆనందంగా స్వదేశం రావాలి అని అనుకుంటూ ఉంటారు ఆటగాళ్లు. కానీ ఇక్కడ కొంత మంది ఆటగాళ్లు మాత్రం సిరీస్ ముగిసినప్పటికీ స్వదేశానికి రాలేదు దీంతో ఏం జరిగిందా అని ఆరా తీస్తే షాకింగ్ నిజం బయటపడింది.
ఇటీవలే వెస్టిండీస్ వేదికగా అండర్-19 ప్రపంచకప్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ప్రపంచ కప్ లో అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు.. అయితే ఇటీవలే ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టులో నలుగురు ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి నిరాకరించారు అన్నది తెలుస్తుంది. అయితే ఆటగాళ్లు ఇలా స్వదేశం వెళ్లడానికి భయపడటానికి కారణం అక్కడ నెలకొన్న అనిశ్చితి అన్నది అర్ధమవుతుంది.
ఈక్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ వెళ్లకుండా లండన్లోనే ఆశ్రయం పొందుతున్నారు క్రికెటర్లు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చెందిన నలుగురు అండర్-19 ప్రపంచకప్ ముగిసిన తర్వాత తమ దేశానికి రాలేదని ప్రస్తుతం బ్రిటన్లో ఆశ్రయం పొందుతున్నారు అంటూ తెలిపింది. ఏదేమైనా ఈ విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది .
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ పాలన వచ్చినప్పటినుంచి ఇక అక్కడి ప్రజలందరూ తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక మొన్నటి వరకు ఎంతో సవ్యంగా సాగితే పాలన అస్తవ్యస్తం గా మారిపోయింది. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఇక ఆఫ్ఘనిస్తాన్ లో ఉండాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జరిగిన ఘటనే దీనికి నిదర్శనం గా మారిపోయింది.