లతా మంగేష్కర్ కు.. టీమిండియా ఆటగాళ్లు నివాళి?

praveen
గాన కోకిల మూగబోయింది.. చిత్రపరిశ్రమ మొత్తం కన్నీటి సముద్రం లో మునిగిపోయింది. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు తన గాత్రం తో ప్రేక్షకులను మైమరపింప చేసి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్ ఇటీవలె తుది శ్వాస విడిచారు. దాదాపు నెల రోజుల నుంచి కరోనా, న్యూమోనియా ఇతర వ్యాధులతో పోరాటం చేసిన ఆమె ఇటీవలే కన్నుమూశారు. ఇక లతా మంగేష్కర్ మరణంతో అభిమానులు అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా లతా మంగేష్కర్ మరణంపై ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.



 ఇకపోతే ఇటీవలే దక్షిణ ముంబైలోని ఆమె నివాసంకు ఇప్పటికే లతా మంగేష్కర్ భౌతికకాయం చేరుకోగా.. ఎంతో మంది ప్రముఖులు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని ఉంచారు. ఈ క్రమంలోనే ఇక లతమంగేష్కర్ అంత్యక్రియలకు ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా తరలి వెళ్తున్నారు. చివరిసారిగా ఆమెకు నివాళులర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ కు టీమిండియా ఆటగాళ్లు నివాళి అర్పించారు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం సమయంలో భారత క్రికెటర్లు అందరూ కూడా తమ భుజాలకి నల్లబ్యాడ్జీలు ధరించి లతా మంగేష్కర్ కు నివాళులు అర్పించారు.


 ఈ మేరకు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు టీమిండియా ఆటగాళ్లు. కాగా ఇక నేటి నుంచి వెస్టిండీస్ భారత్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతుంది. కాగా నేడు టీమిండియా ఆడుతున్న వన్డే మ్యాచ్  ప్రపంచ క్రికెట్ చరిత్రలో వన్డే ఫార్మాట్ లో భారత్ కు 1000వ మ్యాచ్ కావడం గమనార్హం. అహ్మదాబాద్ లోని అతిపెద్ద స్టేడియం మోతెరాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరుగుతోంది  . ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: