సానియా మీర్జా రిటైర్మెంట్.. కొత్త అవతారం?

praveen
సానియా మీర్జా.. భారత్ లో టెన్నిస్ ఆటను ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు టెన్నిస్ అనే పేరెత్తగానే ప్రతి ఒక్క భారత్ ప్రేక్షకుడికి సానియా మీర్జా గుర్తుకు వస్తూ ఉంటుంది.అంతలా తన ఆటతో ఎంతగానో సక్సెస్ అయింది సానియా మీర్జా. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఇటీవలే మళ్లీ అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడుతూ సత్తా చాటుతోంది. ఇలా సుదీర్ఘకాలంపాటు టెన్నిస్ ఆటలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది సానియా మీర్జా. ఇప్పుడు తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.


 అయితే చిన్నప్పటినుంచి జీవితంలో భాగం అయిపోయిన టెన్నిస్ ఆటకు అంత త్వరగా దూరం కాలేను అని చెబుతోంది సీనియర్ ప్లేయర్. అందుకే ఇక ప్లేయర్  గా రిటైర్మెంట్ అయినప్పటికీ టెన్నిస్ ఆట కు ఏదో ఒక విధంగా దగ్గరగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తాను అంటూ చెబుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఆటకు కు రిటైర్మెంట్ ప్రకటించిన వాళ్ళు ఆ తర్వాత కోచ్ లుగా అవతారమెత్తడం సాధారణంగా చూస్తూ ఉన్నాం. క్రికెట్లోనే కాదు అన్ని ఆటలలో కూడా ఇదే కొనసాగుతోంది. ఇప్పుడు తాను కూడా అదే చేస్తాను అంటూ చెబుతుందీ సానియా.


 టెన్నిస్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆటకు ఎంతో అనుబంధం గా ఉండే కోచ్గా మారుతానంటూ చెబుతోంది. అదీ కుదరకపోతే కనీసం కామెంటేటర్ గా అయినా కొనసాగుతాను అంటూ సానియామీర్జా చెబుతోంది. టెన్నిస్ ఎంతో ఖరీదైన క్రీడా అని ప్రతిభావంతులని గుర్తించే నివేదికలు వస్తేనే ఈ రంగంలోకి ఎంతోమంది తనలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తారు అంటూ చెప్పుకొచ్చింది సానియామీర్జా. అయితే గతంలోనే  పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకున్నప్పుడు సానియా మీర్జా తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తుందని  అందరూ అనుకున్నారు కానీ మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన సానియా ఇప్పుడు రిటైర్మెంట్ కు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: