వావ్.. అరుదైన మ్యాచ్ కి కెప్టెన్గా రోహిత్?

praveen
మొన్నటి వరకు భారత క్రికెట్లో 3 ఫార్మాట్లకు కూడా కెప్టెన్గా కొనసాగాడు విరాట్ కోహ్లీ. కానీ ఊహించని పరిణామాలు నేపథ్యంలో కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఏకంగా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వన్డే టి20 లకు కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుసగా ఐదుసార్లు టైటిల్ గెలిపించి తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని చాటాడు రోహిత్ శర్మ.


 ముంబై ఇండియన్స్  జట్టును ఐపీఎల్ లో దిగ్గజ జట్టు గా మార్చడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రోహిత్ శర్మ జట్టును ఎలా ముందుకు నడిపించ పోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. గతంలో స్వదేశంలో న్యూజిలాండ్తో ఆడిన టీ20 సిరీస్ లో విజయం సాధించి తన కెప్టెన్సీలో శుభారంభం చేశాడు. ఇక ఇటీవలే శ్ సౌత్ ఆఫ్రికా పర్యటనకు  గాయం కారణంగా దూరమయ్యాడు రోహిత్ శర్మ.  ఇక మరికొన్ని రోజుల్లో స్వదేశంలో వెస్టిండీస్తో టీ20, వన్డే సిరీస్ ఆడాల్సి ఉండగా జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధమయ్యాడు రోహిత్ శర్మ.



 అయితే కెప్టెన్గా రోహిత్ శర్మ ఒక అరుదైన మ్యాచ్ కు నాయకత్వం వహించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. క్రికెట్ చరిత్రలో టీమిండియా 999 వన్డేలు ఆడింది.. ఇక వెస్టిండీస్తో జరగబోయే సిరీస్ చారిత్రాత్మక మ్యాచ్ కాబోతుంది. 1974లో అజిత్ వాడేకర్ కెప్టెన్సీలోని భారత జట్టు తొలి వన్డే మ్యాచ్ ఆడింది.. 100వ వన్డే మ్యాచ్ కి కపిల్దేవ్ కెప్టెన్సీ వహించాడు. ఇక భారత జట్టు 200వ వన్డే మ్యాచ్ కి అజారుద్దీన్, 300 వన్డే మ్యాచ్ కి సచిన్, 400 వన్డే మ్యాచ్ కి అజారుద్దీన్ కెప్టెన్ లుగా కొనసాగారు. 500 వ వన్డే మ్యాచ్ కి  సౌరవ్ గంగూలి.. 700, 800, 900 వన్డే మ్యాచ్ కి ధోని కెప్టెన్గా కొనసాగగా ఇక ఇప్పుడు భారత జట్టు 1000వ వన్డే మ్యాచ్ కి రోహిత్ శర్మ కెప్టెన్ గా నాయకత్వం వహించ పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: