బిసిసిఐకి షాక్ ఇవ్వబోతున్న.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్ళు ఐపీఎల్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.  ఐపీఎల్ లో కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లు కూడా ఎంతో మంది పాల్గొంటారు. టాప్ ప్లేయర్ లుగా ఉన్న వారు అటు ఐపీఎల్ లో పాల్గొని మంచి అనుభవాన్ని సాధించ డానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక భారత ఆటగాళ్లు అంతకుముందు వరకు ప్రత్యర్థులుగా పోటీపడిన వాళ్ళతో సహచరులుగా మారిపోయి జట్టుగా ఆడటం ఐపీఎల్లో చూస్తూ ఉంటాం.


 అయితే ఐపీఎల్ లో ఎంతోమంది ఇంగ్లాండ్ క్రికెటర్లు కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నారు. ఇక ఎన్నో జట్లలో ఇంగ్లాండ్ క్రికెటర్లు సత్తా చాటుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా ఇలాంటి క్రికెటర్లు సత్తా చాటుతారు అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బిసిసిఐ కి షాక్ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఐపీఎల్లో ఆడేందుకు తమ దేశ ఆటగాళ్లకు అనుమతిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో ఆడేందుకు పర్మిషన్ ఇచ్చింది కదా మరి ఇంకెందుకు షాక్ అని అంటారా.


 పర్మిషన్ ఇచ్చింది కానీ మళ్ళీ లీగ్ చివరి దశలో ఉన్నప్పుడు  తమ ఆటగాళ్లను వెనక్కి పిలిపించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇలా మరికొన్ని రోజుల్లో ఐపీఎల్లో ఆడబోయే ఇంగ్లాండ్ ఆటగాళ్ల విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు షాకింగ్ నిర్ణయం తీసుకోబోతోందని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లీగ్ చివరి దశలో కి చేరిన తర్వాత తమ టెస్టు జట్టు ఆటగాళ్లు అందర్నీ కూడా ఐపీఎల్ నుంచి వెనక్కి పిలిపించుకోవాలని అనుకుంటుందట ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది మొదటిసారి ఏమీ కాదు.. గతంలో కూడా ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తమ ఆటగాళ్లను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెనక్కి పిలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: