ఓహో.. కేఎల్ రాహుల్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా వేలానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఫిబ్రవరి మొదటి వారంలో మెగా వేలం జరగబోతుంది అనేది తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ ఆటగాడు ఎంత ధర పలక పోతున్నాడు.. అంతేకాకుండా ఏ జట్టులోకి వెళ్ళపోతున్నాడు అన్నది కూడా ప్రస్తుతం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎప్పుడూ లేనంతగా ఈసారి మెగా వేలంలో కి  ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు కూడా ఉండడంతో ఈ మెగా వేలం పైనే అందరి దృష్టి ఉంది అన్నది తెలుస్తుంది. 2022 ఐపీఎల్ సీజన్ లో కొత్తగా రెండు జట్లు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లు ఐపీఎల్ లో  ఈ సీజన్ నుంచి  ప్రస్థానాన్ని కొనసాగించ పోతున్నాయి.

 అయితే మెగా వేలానికి ముందు ఇప్పటికే ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఇప్పటికే అన్ని జట్లు  తమ తో అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి. అంతే కాకుండా ఎంతో మంది స్టార్ ప్లేయర్ కూడా జట్టు నుంచి వదిలేశాయి.  పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ రిటైన్ చేసుకోకుండా వేలంలో కి వదిలేసింది అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న కేఎల్ రాహుల్ కు అటు కెప్టెన్సీ అనుభవం కూడా ఉండడంతో కె.ఎల్.రాహుల్ నూ తీసుకునేందుకు కొత్త ఫ్రాంచైజీలు  ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి.

 ఈ క్రమంలోనే మొన్నటివరకు పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా కొనసాగిన కేఎల్ రాహుల్ ఇక ఇప్పుడు కెప్టెన్సీ దక్కించుకో బోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త ఫ్రాంచైజీ లక్నో  కు కె.ఎల్.రాహుల్ సారథ్యం వహించపోతున్నాడట.. వచ్చే నెలలో జరగబోతున్న మెగా వేయడానికి ముందు లక్నో జట్టు ఎంపిక చేసుకున్న ముగ్గురిలో కె.ఎల్.రాహుల్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. దీంతో అతనికి కెప్టెన్సి అనుభవం ఉండడంతో అతనికి కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్   తో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టేయినిస్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణయ్ లను కూడా లక్నో జట్టు తీసుకుందట. మొత్తంగా కె.ఎల్.రాహుల్ కు ఏకంగా మొదటి ప్రాధాన్యతగా 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: