అతనే కెప్టెన్ కావాలంటూ.. పెరుగుతున్న మద్దతు?

praveen
మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ మొదట టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత బిసిసిఐ అతని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది. దీంతో కోహ్లీ మనసు బాధ పడింది. ఇక మనసులో ఎంతో బాధ ఉన్నప్పటికీ నవ్వుకుంటూ సౌత్ ఆఫ్రికా పర్యటన లో టీమిండియా ను ముందుకు నడిపించాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ విజయం సాధించి తన సత్తా ఏంటో బిసిసిఐకి నిరూపించాలి అని అనుకున్నాడు. కానీ ఏం చేస్తాం ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో మరోసారి కోహ్లీ కెప్టెన్సికి భంగపాటు తప్పలేదు. మూడు టెస్టుల సిరీస్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా చివరికి సిరీస్ చేజార్చుకుంది.

 ఇక ఆ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ వదిలేయడమే బెటర్ అని భావించిన విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఓడిపోయినా కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే తాను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఇక కోహ్లీ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తామని అతను జట్టులో  కీలక ఆటగాడిగా కొనసాగాలని కోరుకుంటున్నాం అంటూ బీసీసీఐ దీనిపై స్పందించింది. అంతా బాగానే ఉంది కానీ ఇక విరాట్ కోహ్లీ తర్వాత టెస్ట్ జట్టుకి కెప్టెన్  ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. పరిమిత ఓవర్ల క్రికెట్కు ఒక కెప్టెన్ టెస్ట్ ఫార్మాట్ కి మరో కెప్టెన్ ఉంటే బాగుంటుందని బీసీసీఐ గతంలో అభిప్రాయం వ్యక్తం చేసింది.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం సీనియర్ ప్లేయర్గా ఉన్న పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మకు కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్ కే పరిమితం చేసి టెస్ట్ ఫార్మాట్ కి మాత్రం కొత్త కెప్టెన్ నియమించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎవరు టెస్ట్ కెప్టెన్ గా మారితే బాగుంటుంది అనే దానిపై అందరూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ పంత్ అయితే బెస్ట్ కెప్టెన్ గా సరిపోతాడని కొంతమంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే సునీల్ గవాస్కర్ పంత్ కెప్టెన్గా కావడానికి ఓటేయగా.. ఇక ఇటీవలే యువరాజ్ సింగ్ సైతం యువ వికెట్ కీపర్ కి మద్దతు పలికాడు. వికెట్ల వెనకాలనుంచి ఆటను ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించగల సామర్ధ్యం పంత్ కి ఉందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: