పంత్ ఇస్ బ్యాక్.. అదరగొట్టాడు?

praveen
టీమిండియాలో కి ధోని వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఇటీవల కాలంలో సరైన ఫామ్ లో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న పంత్ కనీస పరుగులు చేయలేక వికెట్ చేజార్చుకుంటూ ఉండటం గమనార్హం. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని బరిలోకి దిగిన టీమిండియాకు.. భారీ పరుగులు చేసి అండగా నిలుస్తాడు అనుకున్న రిషబ్ పంత్ కాస్ట్ పేలవమైన ఫామ్ తో మైనస్ గా మారిపోయాడు. దీంతో రిషబ్ పంత్ ను జట్టు నుంచి తప్పించి వేరొక ఆటగాడికి అవకాశం కల్పించాలి అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే.

 ఇటీవలే రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు కూడా చేయకుండానే వికెట్ చేజార్చుకోవటం చూసి అందరూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రిషబ్ పంత్ ను తప్పించాలని డిమాండ్ లు ఎక్కువ అవుతున్న తరుణంలో కొంతమంది మాజీ ఆటగాళ్లు రిషబ్ పంత్ కి అండగా నిలిచారు. అతనికి కాస్త సమయం ఇస్తే మళ్లీ పుంజుకుని టీమిండియాలో అద్భుతంగా రాణిస్తాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న విమర్శలకు ఇక ఇప్పుడు రిషబ్ పంత్ బ్యాటింగ్ తో సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికా భారత్ మధ్య ప్రస్తుతం మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.

 మూడవ టెస్ట్ మ్యాచ్ లోని రెండవ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు.  సౌత్ ఆఫ్రికా బౌలర్లు  అందర్నీ కూడా ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో నెమ్మదిగా ఆచితూచి ఆడటం చూస్తూ ఉంటాం. కాని రిషబ్ పంత్ మాత్రం టి20 క్రికెట్ ఫార్మాట్లో విజృంభించినట్లుగానే అటు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 133 బంతుల్లోనే 103 చేసి అదరగొట్టాడు. నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రిషబ్ పంత్ . దీంతో పంత్ ఇస్ బ్యాక్ అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: