మూడో టెస్టుకు ముందు.. టీమిండియాకు గుడ్ న్యూస్?

praveen
టీం ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించాలి అని దృఢసంకల్పంతో సౌత్ ఆఫ్రికా పర్యటనకు బయలుదేరింది. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ సాధించని టెస్ట్ సిరీస్ విజయం సాధించి ఆ రికార్డుని తన ఖాతాలో వేసుకోవాలని  విరాట్ కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు. ఇక సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ ఎప్పుడు దిట్ట అన్న విషయం తెలిసిందే. ఇలా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఎంతో పట్టుదలతో టెస్టు సిరీస్ ప్రారంభించిన టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ లోని శుభారంభం చేసింది. సౌత్ ఆఫ్రికా జట్టుకు కంచుకోట లాంటి సెంచురియాన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించి సత్తా చాటింది టీమిండియా.

 ఇక టీమిండియా జోరు చూస్తే రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవడం ఖాయం అని అనుకున్నారు అందరు. కానీ ఊహించని విధంగా వెన్నునొప్పి కారణంగా విరాట్ కోహ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఇక మొదటి సారి టెస్ట్ కెప్టెన్సీ నుంచి చేపట్టిన కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో టీమిండియా ఓటమి పాలయింది. కోహ్లీ లేకపోవడంతో టీమిండియా ఓడిపోయిందని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. దీంతో కనీసం జనవరి 11వ తేదీ జరగబోతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ కి అయిన కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అని అందరూ ఆందోళనలో మునిగిపోయారు.

 ఈ క్రమంలోనే మూడవ టెస్ట్ కు విరాట్ కోహ్లీ అందుబాటులోకి రాబోతున్నాడు అంటూ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచనప్రాయంగా వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇటీవలే కోహ్లీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉండడం  ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కోహ్లీ నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలని బిసిసిఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం. దీంతో కోహ్లీ వెన్ను నొప్పి నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది ఇక మూడవ టెస్ట్ విజేతను తెల్చే మ్యాచ్ గా మారడంతో ఇక ఈ టెస్ట్ కు కోహ్లీ అందుబాటులోకి వస్తే టీమిండియా గెలవడం ఖాయం అని అభిమానులు ఫుల్ కుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: