చరిత్ర తిరగరాశాం : కోహ్లీ
ఈ క్రమంలోనే ఇటీవల సౌతాఫ్రికాలో డిసెంబర్ 26వ తేదీన సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా సమిష్టిగా రాణించి సౌత్ ఆఫ్రికా జట్టుకు సొంతగడ్డపై ఎక్కడ అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ విభాగం విభాగం అద్భుతంగా రాణించడంతో మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. ఏకంగా 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న టీం ఇండియా శుభారంభం చేసింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వర్షం కారణంగా ఒక రోజు ఆట తుడిచి పెట్టుకు పోయినప్పటికీ మ్యాచ్ గెలవడం మాత్రం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. సెంచూరియన్ వేదికగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ను ఓడించిన జట్టు లేదు.. ఇలాంటి హిస్టరీని మేము తిరగరాసాము అంటూ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటన మాకు ఎంతో కష్టతరం గానే ఉంటుంది అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. సౌత్ ఆఫ్రికా పిచ్ లపై రాణించడం ఎంతో సవాల్తో కూడుకున్నది అంటూ విరాట్ కోహ్లీ అన్నాడు ఇక భారత బ్యాట్స్మెన్లు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు అంటూ ప్రశంసలు కురిపించాడు విరాట్ కోహ్లీ.