అయిపాయె.. కోహ్లీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు?
ఇక ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజుగా,పరుగుల యంత్రం గా కొనసాగుతున్నాడు. ఒకసారి విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు అంటే చాలుభారీగా పరుగులు చేస్తాడు అని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. బౌలర్ ఎవరైనా సరే బౌండరీ లతో రెచ్చిపోతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇలా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ గత కొంత కాలం నుంచి మాత్రం పేలవా ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేసి చాలా రోజులు అయింది. అదిగో చేస్తాడు ఇదిగో చేస్తాడు అంటూ అభిమానులు ఆతృతగా వెయిట్ చేయడం తప్ప ఎక్కడా ఫలితం లేకుండా పోతోంది.
ఇప్పుడు మరో చెత్త రికార్డును విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాతీయ క్రికెట్లో శతకం లేకుండానే ముగించాడు. 2020 సంవత్సరం లో కూడా ఏ ఫార్మాట్ లో సెంచరీ అందుకోలేకపోయాడు. రెండేళ్ల కిందట ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బంగ్లాదేశ్ జట్టు మీద శతకం సాధించి అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఆతర్వాత మాత్రం శతకం అనే పదానికి ఎన్నో మైళ్ల దూరం వచ్చేసాడు. ఇక ఈ ఏడాదిలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో అయినా కనీసం శతకం లోటు పూడుస్తాడు అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారూ. కానీ రెండు ఇన్నింగ్స్ లో కూడా 35క, 18 పరుగులు మాత్రమే చేసి చేజేతులారా వికెట్ చేజార్చుకుని పెవిలియన్ చేరాడు. దీంతో అభిమానులను నిరాశ లో మునిగిపోయారు.