షమి నువ్వో అద్భుతం.. కొండంత బాధ గుండెల్లో.. అయినా పట్టు వదలలేదు?
ఈ క్రమంలోనే మహ్మద్ షమి కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలోనే అతని భార్య మహ్మద్ షమీ పై సంచలన ఆరోపణలు చేసి ఏకంగా విడాకులు కూడా ఇవ్వడం.. ఈ వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్లడం బౌలర్ మహమ్మద్ షమీని మరింతగా కృంగదీసింది అని చెప్పాలి. ఫామ్ కోల్పోయానని మహమ్మద్ షమీ ఎక్కడ నిరాశ చెందలేదు. ఓటమి నుంచి విజయం కోసం దారులు వెతకడం మొదలుపెట్టాడు. కొండంత బాధ గుండెల్లో పెట్టుకొని టీమిండియాలో రాణించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. మళ్ళీ ఫిట్నెస్ సాధించాడు.
ఇక మళ్లీ అద్భుతమైన ఫామ్ లోకి రావడంతో టీమిండియా సెలెక్టర్లు మహమ్మద్ షమీకి జట్టులో అవకాశం కల్పించారు. మహ్మద్ షమి జట్టులోకి వచ్చిన సమయంలో.. హా.. ఎన్ని రోజులు ఉంటాడులే మూడు మ్యాచ్ లలో అతని తీసి పక్కన పెట్టేస్తారు అని అందరూ ఎగతాళి కూడా చేశారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా తన నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఇటీవలే టెస్ట్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డును సాధించాడు మహమ్మద్ షమీ.
టెస్ట్ క్రికెట్ లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా మహమ్మద్ షమీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే టీమిండియా తరఫున ఈ స్థాయి వికెట్లను సాధించిన పేసర్ ల సంఖ్య పరిమితం గానే ఉంది అని చెప్పాలి. ఇలా తక్కువ సమయంలోనే 200 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ముందుగా భారత మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జవగళ్ శ్రీనాథ్ లు ఉన్నారు. ఇక ప్రస్తుతం అరుదైన రికార్డు సాధించిన 5వ ఆటగాడిగా మాత్రమే మహమ్మద్ షమీ నిలిచాడు. ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని రికార్డు సాధించిన మహమ్మద్ షమీ పై ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.