టీమ్ ఇండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే?
ఈ క్రమంలోనే అటు పిచ్ పై కాస్త తేమ ఉండటంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే సౌత్ ఆఫ్రికా బౌలర్లు విజృంభించారు. భారత బ్యాట్స్మెన్లు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పదునైన బంతులతో వరుసగా వికెట్లు పడగొట్టడం లో విజయం సాధించారు సౌతాఫ్రికా బౌలర్లు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులతో పటిష్టమైన స్థితిలో ఉంది టీమిండియా. ఇలాంటి సమయంలో అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు విజృంభించడంతో కేవలం 55 పరుగుల్లో మాత్రమే మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది అని చెప్పాలి. వరుసగా టీమిండియా 7 వికెట్లు కూడా పేక మేడలా కూలిపోయాయి.
సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ ఎంగిడి అద్భుతమైన ప్రదర్శన చేశాడు అనే చెప్పాలి. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే తొలి రోజు శతకంతో చెలరేగిన కె.ఎల్.రాహుల్ మరో రెండు బంతులను మాత్రమే ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి చివరికి వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత ఆజింక్య రహానే గ్రీస్ లో కాస్త కుదుర్చుకున్నట్లు కనిపించినప్పటికీ అర్థ శతకానికి రెండు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వారు ఎవరు కూడా క్రీజ్ లో నిలువ లేదు అని చెప్పాలి రిషబ్ పంత్ 8, రవిచంద్రన్ అశ్విన్ 4, శార్దూల్ ఠాకూర్ 4, మహ్మద్ షమీ 8,బూమ్రా 14, సిరాజ్ 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఎంగిడి ఆరు వికెట్లు తీసుకోగా రబాడా 3, జాన్సన్ ఒక వికెట్ తీశారు.