ఆ కెప్టెన్ లేకపోతే నేనులేను.. అతని వల్లే ఇలా ఉన్న : హర్భజన్

praveen
భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు అద్భుతమైన సేవలు అందించిన హర్భజన్ సింగ్ ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో ప్రపంచ క్రికెట్లో అరుదైన రికార్డులు సాధించిన స్పిన్నర్ గా కూడా హర్భజన్ సింగ్ రికార్డు సృష్టించాడు.. తన స్పిన్ మాయాజాలంతో ఎన్నోసార్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి భారత జట్టుకు విజయాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అవసరమైనప్పుడు బ్యాటింగ్ లో కూడా చెలరేగిపోతు అద్భుతంగా రాణించాడు హర్భజన్ సింగ్. ఆ తర్వాత యువ ఆటగాళ్ల పోటీ పెరగడంతో భారత జట్టులో స్థానం సంపాదించుకోలేక పోయాడు.


 ఆ తర్వాత ఐపీఎల్లో రాణించినప్పటికీ హర్భజన్ సింగ్ కు భారత జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు హర్భజన్ సింగ్. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్.. సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను భారత క్రికెట్ లో ఇంత గొప్ప ఆటగాడిగా ఎదగడానికి టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కారణం అంటూ చెప్పుకొచ్చాడు. కెరియర్ మొదట్లో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన నాయకుడు అతడే అంటూ చెప్పుకొచ్చాడు.. కెరీర్ ప్రారంభంలో ఒక అనామకుడు గా  ఉన్న తనను వెన్నుతట్టి ప్రోత్సహించి అండగా నిలిచింది సౌరవ్ గంగూలీ అని ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ప్రత్యేక ఆటగాడిగా పరిణితి చెందాను అంటూ బజ్జీ చెప్పుకొచ్చాడు.


 అయితే తనలో ఎంతో నైపుణ్యం దాగి ఉంది అన్న విషయాన్ని సౌరవ్ గంగూలీ గ్రహించారు. అయితే నేను ఇది ఎంతవరకు రాణిస్తా అన్న విషయం మాత్రం దాదాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ విషయానికి వస్తే నేను బరిలోకి దిగితే పని పూర్తి చేస్తాను అని తనపై నమ్మకం ఉంచేవాడు అంటూ గుర్తు చేసుకున్నాడు. ఎవరికైనా జీవితంలో, ప్రొఫెషనల్ గా  సరైన మార్గంలో నడిపించే ఒక వ్యక్తి ఉంటారు. ఇక తన జీవితంలో అది సౌరవ్ గంగూలీ అంటూ చెప్పుకొచ్చాడు.. సెలక్టర్ల తో పట్టుబట్టి మరీ జట్టులో నేను ఉండాలి అని కోరాడు. ఆరోజు దాదా పట్టు పట్టపట్టడం వల్లే ఇప్పుడు నేను ఒక మంచి క్రికెటర్ స్థాయికి ఎదగ గలిగాను అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: