ఎవరైతే బాగుంటుంది.. తలపట్టుకుంటున్న కోహ్లీ?

praveen
ప్రస్తుతం టీమిండియా ముందు ఉన్న టార్గెట్ ఒక్కటే.. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు టీమిండియా ఒక్కసారి కూడా విజయం సాధించని  సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించడం.  ఇక దీని కోసం ప్రస్తుతం టీమిండియా ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ చెమటోడుస్తుంది. సౌత్ ఆఫ్రికా గడ్డపై కాలు పెట్టి క్వారంటైన్ పూర్తి చేసుకొని కఠిన నిబంధనల మధ్య ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా గడ్డపై ఈసారి టెస్ట్ సిరీస్ విజయం సాధించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి విషయంలో కూడా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే చివరగా 2018లో సౌత్ ఆఫ్రికా లో పర్యటించింది టీమిండియా.


 ఇక 2008 పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్ విజయం సాధిస్తుంది అని అనుకున్నప్పటికీ చివరి సిరీస్ డ్రాగా ముగిసింది. ఇక ఇప్పుడు కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా మూడు టెస్టుల సిరీస్ ఆడబోతుంది. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక సౌత్ ఆఫ్రికా గడ్డపై విజయం సాధించాలంటే టీమిండియా తుది జట్టు ఎంపిక ఎంతో కీలకంగా మారబోతుంది. దీంతో ఎవరికీ అవకాశం ఇవ్వాలి అనేదానిపై ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రావిడ్ లు తలపట్టుకుంటున్నారట.


 తుది జట్టులో ఎవరిని కొనసాగించాలి ఎవరిని  పక్కన పెట్టాలి అనేదానిపై తర్జన భర్జన పడుతున్నారట కెప్టెన్ కోహ్లి కోచ్ రాహుల్ ద్రావిడ్. అయితే ఇటీవలే స్వదేశీ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్లో రహానే నిరాశపరిచాడు. అయినప్పటికీ అతనిని సౌత్ ఆఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేస్తూ  బీసీసీఐ మరో అవకాశం కల్పించింది. దీనికి కారణం గతంలో 2018 సౌత్ఆఫ్రికా పర్యటనలో రహానే అద్భుతంగా రాణించాడు. ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.. అదే సమయంలో అటు యువ ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తూ ఉండటం గమనార్హం. దీంతో ఎవరినీ ఎంపిక చేయాలనే దానిపై మాత్రం తలపట్టుకుంటున్నారట కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: