మెగా వేలంలో.. ఆ జట్టు లోకి వెళితే బాగుండు?
ఈ క్రమంలోనే మెగా వేలంలో ఎవరు ఏ జట్టులోకి వెళ్ళిపోతున్నారు అనేదాన్ని పై ఇటూ ఎంతో మంది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మెగా వేలంలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఇక ఈ సారి ఐపీఎల్ వేలానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అనీ చెప్పాలి మరికొన్ని రోజులు ఐపీఎల్ మెగా వేలం జరగబోతుంది అనుకుంటున్న సమయంలో మొన్నటి వరకూ ఢిల్లీ జట్టులో ఆడి ఇటీవలే మెగా వేలంలో కి వదిలివేయబడిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మనస్సులో మాట బయట పెట్టాడు.
వచ్చే ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాలని అనుకుంటున్నా అంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు ఇక రానున్న మెగా వేలంలో చెన్నై సూపర్ జట్టు యాజమాన్యం అతను కొనుగోలు చేస్తుందని ఎంతగానో ఆశతో ఉన్నాను అంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.. చెన్నై సూపర్ కింగ్స్ నాకు ఎంతగానో దగ్గరైన ఫ్రాంచైజీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాకు ఒక స్కూల్ లాంటిది.. అక్కడే నేను ఎల్కేజీ యూకేజీ ప్రైమరీ కూడా చదివాను. హైస్కూల్ చదువు కూడా అక్కడే ప్రారంభించి పదవ తరగతి పరీక్షలను పూర్తిచేసి కళాశాలలకు మారాను. కానీ ఎంత చదివినా కూడా మళ్ళీ ఇంటికి రావాల్సిందే కాబట్టి నేను మళ్ళీ చెన్నై సూపర్ కింగ్ కి తిరిగి రావాలని ఇష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు.