ఫలితం లేకపోతే.. కెప్టెన్ పై బ్యాన్ విధించాలి : షేన్ వార్న్
అయితే ఇలా స్లో ఓవర్ రేట్ నమోదైన సమయంలో అటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కొంత కోత విధించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అంపైర్లు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఇలాగే జరగగా.. ఇక ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఇప్పటికే మొదటి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి నిరాశతో ఉంది ఇంగ్లండ్ జట్టు. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయలేక తడబడుతుంది. ఇలాంటి సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయింది ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి.
స్లో ఓవర్ రేట్ కారణంగా ఇటీవలే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 5 పాయింట్లు తగ్గిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు ఈ 5 పాయింట్లను 8 కి చేర్చడంతో ఊహించని షాక్ తగిలింది. అయితే ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ఫీజులో కోత విధించిన ఫలితం లేకపోతే స్లో ఓవర్ రేట్ సమయంలో జట్టు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించాలని వారు అభిప్రాయం వ్యక్తం చేశాడు షేన్ వార్న్ . కాగా ఇటీవల స్లో ఓవర్ రేట్ కారణంగా ఎనిమిది పాయింట్లతో పాటు 100% మ్యాచ్ ఫీజ్ పై కూడా కోత విధించిన ఐ.సి.సి ఇంగ్లాండ్ జట్టుకు ఇవ్వడం గమనార్హం.