కల నెరవేరింది.. నటరాజన్ ట్విట్ వైరల్?

praveen
కొంత మంది క్రికెటర్లు ఫేమస్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది. కానీ కొంతమంది మాత్రం బుల్లెట్ లాగా దూసుకుపోయి తక్కువ సమయంలోనే ఎంతోమంది చూపు ఆకర్షిస్తూ ఉంటారు. అలాంటి క్రికెటర్లలో తమిళనాడుకు చెందిన నటరాజన్ కూడా ఒకరు. ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చిన నటరాజు ఒక్క ఐపీఎల్ సీజన్ తోనే ఎంతగానో ఫేమస్ అయ్యాడు. తనదైన శైలిలో బౌలింగ్ ప్రతిభను చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు.



 ఐపీఎల్లో యార్కర్ కింగ్ గా పేరు సంపాదించుకున్నాడు నటరాజన్. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినా టీమిండియా జట్టులో కేవలం నెట్ బౌలర్ గా  మాత్రమే అవకాశం దక్కించుకున్నా.డు కానీ అతనికి మాత్రం టాలెంట్తో పాటు అదృష్టం కలిసివచ్చింది. దీంతో ఇక దక్షిణాఫ్రికా పర్యటనలోనే 3 ఫార్మాట్లలో కూడా అరంగేట్రం చేసి సత్తా చాటాడు. అప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికి ఎక్కడ ఒత్తిడికి లోనుకాకుండా వరుసగా వికెట్లు తీసి టీమిండియాకు విజయం అందించడంలో కీలక పాత్ర వహించాడు.ఆ తర్వాత గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు.


 ఇకపోతే నటరాజన్ ఇటీవలే నా కల నెరవేరింది అంటూ సోషల్ మీడియా లో పెట్టిన పోస్టు వైరల్ గా మారి పోయింది. తన పేరిట క్రికెట్ మైదానం నెలకొల్పాలి అన్న ఆశయం తీరింది అంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు. సకల సౌకర్యాల తో మా గ్రామం లో కొత్త క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం తో నా కల నెర వేరింది అంటూ తెలిపాడు.. గత ఏడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశా.. ఈ ఏడాది డిసెంబర్లో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసాను. దేవుడికి ఎప్పుడు కృతజ్ఞుడనై ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. తమిళనాడులోని సేలం సమీపంలో  చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ అక్కడే ఒక గ్రౌండ్  ఏర్పాటు చేసి ఎంతో మంది యువకులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: