కెప్టెన్గా కోహ్లీకి ఇదో మంచి అవకాశం : బజ్జీ

praveen
మరికొన్ని రోజుల్లో భారత జట్టు అటు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్ళ పోతుంది. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే టెస్ట్ మ్యాచ్ లో ఆడబోతుంది భారత జట్టు. ఇక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగడానికి సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవడం ఎంతో కీలకం గా మారిపోయింది. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ కోహ్లీ సారథ్యంలో ఆడబోతుంది టీమిండియా. వన్డే టి20 సిరీస్ లు మాత్రం అటు రోహిత్ శర్మ సారథ్యంలో ఆడబోతుంది.


 ఇటీవలే విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మ వన్డే కెప్టెన్గా ఎంపిక చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక పోతే ఇక టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా పర్యటనపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా పర్యటన లో టీమిండియా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇటీవలే భారత వెటరన్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించటానికి కోహ్లీ సెనకు ఒక మంచి అవకాశం ఉంది అంటూ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.



 అయితే ఇప్పటివరకు సౌతాఫ్రికాలో ఒక్కసారి కూడా టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్లో విజయం సాధించలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా లో తొలిసారి టెస్టు సిరీస్ను గెలిచేందుకు కోహ్లీ సేన కు ఇది ఒక సువర్ణావకాశం అంటూ చెప్పుకొచ్చారు హర్భజన్ సింగ్. ఒకప్పుడు సఫారీ జట్టు ఎంతో బలంగా ఉండేది. కానీ ఇప్పుడు జట్టు అంత బలంగా కనిపించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా లో పర్యటించిన సమయంలో ఎబి డివిలియర్స్, డూప్లేసెస్  లాంటి ఆటగాళ్ళు టీమిండియా గెలుపుకు అడ్డుపడ్డారు అంటూ హర్భజన్ సింగ్ అన్నాడు. ఇకపోతే ఈ నెల 26వ తేదీ నుంచి టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: