వార్నర్ కోసం కార్లో కూర్చొని ఏడ్చేదాన్ని.. భార్య షాకింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా క్రికెటర్లు ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. వరుసగా క్రికెట్ మ్యాచ్ల కోసం ఇక అన్ని దేశాలకు పర్యటనలకు వెళుతూ ఉంటారు. దీంతోక్రికెటర్లకు కుటుంబంతో సమయం గడిపేందుకు అవకాశమే ఉండదు అని చెప్పాలి. అయితే క్రికెటర్లు బిజీగా ఉన్న సమయంలో కుటుంబంతో సమయం గడపకపోతే ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలా ఫీలవుతారు అన్న విషయాన్ని ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ వార్నర్ చెప్పుకొచ్చారు. డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ వార్నర్ అందరికీ సుపరిచితురాలే.



 ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా అప్పట్లో డేవిడ్ వార్నర్ తో కలిసి డాన్స్ లు వేసి అందరినీ ఆకట్టుకుంది. అయితే డేవిడ్ వార్నర్ ఇంటికి దూరంగా ఉండటంతో తను ఎలా బాధపడుతుందో అన్న విషయం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. డేవిడ్ వార్నర్ ఇంటికి దూరమైన సమయంలో తాను కారులో కూర్చుని ఏడ్చేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది క్యాండిస్. గత మూడు నెలల్లో కేవలం 14 రోజులు మాత్రమే వార్నర్ తమతో కలిసి ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది క్యాండిస్. ఇక ఏడాదిలో 300 రోజులు ఇంటికి దూరంగా ఉంటాడని తెలిపింది. ఇక ముగ్గురు పిల్లలతో ఎక్కడికైనా వెళ్లాలంటే ఒక్కదాన్నే కార్ తీసుకొని వెళ్తాను. కొన్ని కొన్ని సార్లు మనసు పగిలితే ఏడుపు వస్తుంది.


 దీంతో ఒంటరి తనాన్ని ఫీల్ అవుతుంటాను. ఇక నేను డ్రైవింగ్ చేస్తూ ఏడుస్తూ ఉంటే పిల్లలు వెనుక కూర్చొని అరుస్తూ ఉంటారు. ఆ బాధను మాటల్లో చెప్పలేను. నా బెస్ట్ ఫ్రెండ్ నా భర్త.. అలాంటి వ్యక్తి దూరం గా ఉంటే బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక తమ తో గడిపే సమయం లో మాత్రం వార్నర్ ఒక భర్తగా తండ్రిగా ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటాడు క్యాండీస్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: