సిక్స్ కొట్టాడని.. బంతితో కొట్టిన బౌలర్?
అయితే రెండో టీ20 మ్యాచ్లో భాగంగా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది చేసిన పని ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతోంది. కంట్రోల్ తప్పిన షాహీన్ అఫ్రిది ఏకంగా బ్యాట్స్మెన్ను బంతితో కసితీరా కొట్టాడు. ఇక ఈ హఠాత్పరిణామానికి అంపైర్లు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఇన్నింగ్స్ లో భాగంగా మూడవ ఓవర్ వేస్తున్నాడు షాహీన్ అఫ్రిది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ రెండో బంతిని భారీ సిక్స్ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి లోనయ్యాడు పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది. తర్వాత ఎంతో కోపంగా బంతి విసిరాడు. అయితే ఆ బంతిని ఎంతో బాగా డిఫెన్స్ చేశాడు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్.
ఈ క్రమంలోనే ఇక ఆ బంతిని చేతితో అందుకున్న షాహీన్ అఫ్రిది ఏకంగా వికెట్లను కొడుతున్నట్టుగా బ్యాట్స్మెన్ను కసితీరా కొట్టాడు. ఇక బంతి బలంగా తాగడంతో హుస్సేన్ ఒక్కసారిగా కిందపడిపోయి నొప్పితో అల్లాడిపోయాడు. ఇక షాహీన్ అఫ్రిది ఇలా చేయడంతో అంపైర్ల తో పాటు పాకిస్తాన్ ఆటగాళ్ళ సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు ఇక ఆ తర్వాత షాకింగ్ ఆఫ్రిది బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్లి అతని పైకి లేపి సారీ చెప్పాడు. అయితే బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇక ఈ విషయాన్ని చూసీచూడనట్లుగా వదిలేశారు. ఒకవేళ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేసి ఉంటే షాహీన్ అఫ్రిది పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండేది. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.