ధోని ఫోటో షేర్ చేసిన.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా?
అయితే ధోనీ ఎక్కడైనా ఒక్కసారి కనిపిస్తే చాలు ధోనీతో ఒక ఫోటో దిగాలి అని భావిస్తూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. ఇక తమ అభిమాన క్రికెటర్ ధోనీ కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. అయితే కేవలం సామాన్యులు మాత్రమే కాదు ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు కూడా ధోనికి అభిమానులుగా కొనసాగుతున్నారు. అయితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ఇటీవలే ధోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటో పోస్ట్ చేసింది ఒక సాదాసీదా మనిషి కాదు.ఒక బిగ్ సెలబ్రిటీ.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రెస్లింగ్ ఎంటర్టైనర్ డబ్ల్యూ డబ్ల్యూఈ స్టార్ జాన్ సేన. ఈ పేరు తెలియని ప్రేక్షకుడు లేడు అనే చెప్పాలి. అయితే ఇటీవలే జాన్ సేన తన సోషల్ మీడియా ఖాతాలో భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇమేజ్ ఒకటి షేర్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మెట్ల నుంచి కిందికి దిగుతూ ఎవరికో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తున్నాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ఇక ఈ ఫోటోని షేర్ చేసిన జాన్ సీనా ఎలాంటి క్యాప్షన్ మాత్రం పెట్టలేదు. దీంతో ఇక ఈ ఫోటో చూసి నెటిజన్ల తమకు ఇష్టమున్న క్యాప్షన్ పెట్టుకుంటూ ఉండటం గమనార్హం.