కోహ్లీని వెనక్కి నెట్టిన బాబర్ ఆజామ్... అరుదైన రికార్డు?
ప్రస్తుతం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేయడం కాదు అతి తక్కువ సమయంలోనే అరుదైనా మైలురాయిని అందుకుంటూ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు. ఇక ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో కూడా బాబర్ అజామ్ రాణించాడు అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ బాగా రాణించి టీ20ల్లో ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2500 పరుగులు అతివేగంగా టీ20ల్లో పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
అయితే ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. బాబర్ అజామ్ అరవై రెండు ఇన్నింగ్స్ లో 2500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 68 ఇన్నింగ్స్ లో 2500 పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలవడం గమనార్హం. ఇలా విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టిన బాబర్ అజామ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ 78 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో 39 పరుగులు చేశాడు బాబర్ అజం.