టీ 20 వరల్డ్ కప్ ఆ జట్టుదే... కారణాలివే?
ఇప్పుడు కప్ ఎవరు గెలుచు కుంటారు అనే అంశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సారి టీ 20 ప్రపంచ కప్ గెలిచే సత్తా ఈ నాలుగు జట్లలో ఇంగ్లాండ్ కే ఉందని చెబుతున్నారు. దీనికి కారణాలు చెప్పినా అవి మామూలుగానే అనిపిస్తాయి. కానీ వీరు ఆడిన మ్యాచ్ ల ఆధారంగా చూస్తే ఒక్క సౌత్ ఆఫ్రికా తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ తప్పిస్తే, మిగిలిన అన్ని మ్యాచ్ లలో సింగిల్ హ్యాండెడ్ విజయాలు అని చెప్పవచ్చు. ప్రత్యర్థులు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇంగ్లాండ్ ను ఈ రకంగా చూసినా బలమైన జట్టుగానే కనిపిస్తోంది. కాబట్టి వరల్డ్ కప్ వారిదే అంటూ బలంగా నమ్ముతున్నారు.
ఏ విభాగంలో చూసినా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ లో 9 మంది హిట్ చేయగల సమర్థులు, అదే విధంగా బౌలింగ్ లోనూ టాప్ లో ఉన్నారు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే ఒకసారి ఈ మ్యాచ్ లను రివైండ్ పెట్టుకుని చూస్తే మీకే అర్థమవుతుంది. బట్లర్, బెయిర్ స్టో, లివింగ్ స్టన్, మోర్గాన్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే జట్టు ఏ పరిస్థితుల్లో ఉన్నా విజయం వైపు నడిపించడానికి సరైన నాయకుడు మోర్గాన్ ఉన్నాడు. ఇక చెప్పేదేముంది ఆదివారం వరకు వెయిట్ చేయడమే మిగిలింది.