టీమిండియా పరిస్థితి ఇలాగే ఉంది.. ట్రోల్ వైరల్?

praveen
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం తెగ పెరిగిపోయింది. గంటల తరబడి ఎంతోమంది సోషల్ మీడియా లోనే కాలం గడుపుతున్నారు.. అయితే ఇక సోషల్ మీడియా వాడకం తెగ పెరిగిపోయిన నేపథ్యంలో అటు ట్రోలర్స్ కూడా యమ ఫాస్ట్ అయిపోయారు. ఏదైనా చిన్న విషయం దొరికిందంటే చాలు ఇక దానిని ట్రోల్ రూపంలో మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఎంతోమంది. ఇలా ట్రోల్స్ మీమ్స్ చేసి డబ్బులు సంపాదిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ వైరల్ గా మారిన ట్రోల్స్ కాస్త నవ్వు తెప్పిస్తూ ఉంటాయి.



 ఇక ఇప్పుడు టీమిండియా గురించి ఇలాంటి ట్రోల్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. మొదటి రెండు మ్యాచ్లలో ఘోరంగా విఫలమైన టీమిండియా ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్లలో మాత్రం అద్భుతంగా రాణించింది. ప్రత్యర్థులపై భారీ తేడాతో విజయం సాధించి ఎంతో అద్భుతమైన రన్రేట్ సాధించింది టీమిండియా. ఈ క్రమంలోనే సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితేటీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు చేరాలి అంటే న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాల్సి ఉంటుంది.



 ఈ క్రమంలోనే భారత అభిమానులందరూ ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని మా పూర్తిస్థాయి మద్దతు మీకే ఉంటుంది అంటూ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక టీమిండియా ఆటగాళ్లు సైతం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి అంటు కోరుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే దీనిని ఉద్దేశిస్తూ టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు ఎలా మద్దతు ఇస్తున్నారు ఎలా ప్రోత్సహిస్తున్నారు అనే విషయాన్ని తెలిపేలా ఒక ట్రోల్ సోషల్ మీడియాలో వైరల్  గా మారిపోయింది  ఇక ఈ ఫోటోలో ధోని రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతూ ఉంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఏకంగా రషీద్ ఖాన్ షర్ట్ సరి చేస్తున్నారు. తప్పకుండా గెలవాలి అంటూ ప్రోత్సహిస్తున్నట్లు గా ఉంది. ఇక ఇది చూసిన అందరూ నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: