ఐపీఎల్ వేలంలో ఆ ఆటగాడి కోసం ప్రాంఛైజీలు పోటీ?

VAMSI
బీసీసీఐ నిర్వహణలో ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ గురించి ప్రపంచ దేశాలందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు విజయవంతంగా 14 సీజన్ లను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఇంకా ఘనంగా ఐపీఎల్ జరగనుంది. దేనెయికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఐపీఎల్ చరిత్రలో ట్రోఫీ కోసం కేవలం 8 జట్లు మాత్రమే పోటీ పడిన సందర్భం మనము చూశాము. కానీ వచ్చే ఏడాది నుండి మొత్తం 10 జట్లు ఐపీఎల్ సీజన్15 ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. కాబట్టి ఎప్పటిలాగా కాకుండా ఈ సారి మ్యాచ్ ల సంఖ్య సైతం పెరగనుంది. ఇక ఐపీఎల్ అభిమనులకు పండగే పండుగ.
ఇది ఒక కారణం అయితే, ఇంకొక కారణం జనవరి లో మెగావేలం జరగనుంది. జట్లు లోని ఆటగాళ్లు అంతా మారిపోనున్నారు. కొందరు మాత్రం ఈ సారి ఐపీఎల్ కు ముగింపు పలికే ఛాన్సెస్ ఉన్నాయి.  ఈ కారణాల చేత ఇప్పటి నుండి అన్ని ఐపీఎల్ ప్రాంఛైజీలు ప్లేయర్స్ కోసం వేట ప్రారంభించారు. ముఖ్యంగా ఈ సారి సీనియర్ ప్లేయర్స్ పై వేటు పడుతుందని తెలుస్తోంది. గతం నుండి అంటి పెట్టుకుని వస్తున్న ప్లేయర్స్ పెద్దగా ఆడకపోవడమే కారణమని చెబుతున్నారు. అందుకే అలాంటి ప్లేయర్స్ అందరికీ గట్టి షాక్ తగలనుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ పై అన్ని ప్రాంచైజీల దృష్టి నెలకొంది.
ఇందులో రాణించిన కుర్ర ప్లేయర్లపై కోట్లు కుమ్మరించనున్నారు. అందులో భాగంగా శ్రీలంకకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ చరిత అసలంక తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు నాక్ అవుట్ లో జరిగిన 6 మ్యాచ్ లలో 231 పరుగులు చేశాడు. క్రికెట్ విశ్లేషకులు సైతం ఇతనిపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఇతని కోసం ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అసలంక ఆ అదృష్టం దక్కించుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: