పాక్ తో ఓటమి తర్వాత.. విరాట్ కోహ్లీ ఏమన్నాడో తెలుసా?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ నిరాశలో మునిగిపోయారు...  ఎందుకంటే ఎంతో దూకుడు మీద ఉన్న టీమిండియా దాయాది జట్టు అయినా పాకిస్తాన్ ఫై అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అని అనుకున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శనపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకున్నారు.  టీమిండియా ఉన్న దూకుడుకి పాకిస్థాన్ జట్టును చిత్తుగా ఓడిస్తుంది అని భావించారు. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే  భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం సింగిల్ డిజిట్ స్కోర్ కే సరి పెట్టుకుని పెవిలియన్ చేరింది .

 దీంతో మొదటి పది ఓవర్లలోనే టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.  అయితే అటు పాకిస్థాన్ బౌలర్లు కూడా ఎంతో ధాటిగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడానికి కూడా టీమిండియా బ్యాట్స్మెన్లు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  దీంతో పాకిస్తాన్ జట్టు చరిత్ర తిరగ రాసింది అనే చెప్పాలి. ఇప్పటివరకు భారత జట్టుపై ఒక్కసారి కూడా విజయం సాధించని పాకిస్తాన్ నిన్నటి మ్యాచ్లో భారత జట్టు పై ఒక్క వికెట్ కోల్పోకుండా అలవోకగా విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో టీమిండియా ప్రదర్శనపై ప్రస్తుతం భారత అభిమానులు అందరూ తీవ్ర నిరాశతోనే ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇకపోతే ఇటీవలే పాకిస్తాన్ తో  మ్యాచ్ లో ఓటమిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కోహ్లీ చెప్పుకొచ్చాడు. తాము మొదట్లో వికెట్లు కోల్పోయిన తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నించాము అంటూ తెలిపారు. కానీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారని కోహ్లీ అన్నాడు. మరో 15 -20 పరుగులు చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కానీ పాకిస్తాన్ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు అంటూ తెలిపాడు.  అయితే ఇది కేవలం మొదటి మ్యాచ్ అని.. చివరి మ్యాచ్ కాదని తర్వాత మ్యాచ్ లలో రాణించి  సత్తా చాటుతాం అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: