రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు.. గెట్ రెడీ?

praveen
మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే భారత్లో జరగాల్సిన ఈ టి20 వరల్డ్ కప్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా యూఏఈ వేదికగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్  కూడా విడుదల చేసింది ఐసీసీ. ఇక అటు టి20 వరల్డ్ కప్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు సిద్ధం కాగా టి20 వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధించి కప్ గెలవటానికి అన్ని జట్లు కూడా సంసిద్ధం అయిపోతున్నాయి. ఇప్పటికే మైదానంలో తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ మొదలు పెట్టాయ్ అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం వివిధ జట్ల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి.

 అయితే టి20 వరల్డ్ కప్ కి ముందు ఈ వార్మాప్ మ్యాచ్లు కూడా ఎంతో కీలకంగా మారిపోతాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి టీమిండియాలో కీలక ఆటగాడిగా స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఎలా రాణించ బోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అదే సమయంలో ఇటీవల ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా టి20 వరల్డ్ కప్ లో స్థానం సంపాదించుకున్నారు. ఇలా యువ ఆటగాళ్లు వరల్డ్ కప్ కప్ లో ఒత్తిడిని జయించి ఎలా రాణిస్తారు అన్నది చూడాలని ఉంది  ఇకపోతే ప్రస్తుతం ఇటీవలే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ వార్మప్ జరిగింది. టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ వార్మప్ మ్యాచ్ జరిగింది.

 ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది  కాగా నేడు ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా జట్టు వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది. అయితే మొదట వార్మప్ మ్యాచ్ ఆడిన సమయంలో రోహిత్ శర్మ టీమిండియా జట్టులో లేడు.  ఇక మొదటి వార్మప్ లో విశ్రాంతి తీసుకు న్నా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో నేడు జరగబోయే మ్యాచ్ లో మాత్రం జట్టుతో కలువనున్నాడు. రోహిత్ శర్మతో పాటు వరుణ్ చక్రవర్తి కూడా ఈ రోజు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు మంచి ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ కు నేడు రెస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశం ఉంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: