కెప్టెన్సీ నుంచి తప్పించడంపై.. మొదటిసారి స్పందించిన వార్నర్?

praveen
2021 ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు అభిమానులు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదలైనప్పటి నుంచి జట్టు కెప్టెన్గా కొనసాగాడు డేవిడ్ వార్నర్. జట్టులో కీలక ఆటగాడిగా అద్భుతంగా రాణించాడు. ఓవైపు జట్టు మొత్తం విఫలం అవుతున్నప్పటికీ ఒంటిచేత్తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విజయాలు అందించాడు డేవిడ్ వార్నర్. అంతే కాదు మహా మహా జట్లకు సైతం సాధ్యం కాని ఐపీఎల్ టైటిల్ను అందించి సక్సెస్ఫుల్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు.  అలాంటి డేవిడ్ వార్నర్ విషయంలో ఇటీవలే యాజమాన్యం దారుణంగా వ్యవహరించింది.

 మొదట డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ లోనే 2021 ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రంగంలోకి దిగింది. కానీ వరుసగా ఆడిన ఐదు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు ఓడి పోయింది  అటు కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేలవా ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఒక్కసారిగా డేవిడ్ వార్నర్ కెప్టెన్గా తప్పించి కేన్ విలియమ్సన్ కొత్తగా కెప్టెన్ ని చేసింది. అయిన జట్టు ప్రదర్శన మాత్రం మారలేదు. అదే రీతిలో వరుసగా పరాజయాలను చవిచూసింది.  అయితే ఇలాంటి సమయంలో అటు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నుంచి తపించడమే కాదు పూర్తిగా జట్టుకు దూరం చేసింది యాజమాన్యం. ఒకానొక సమయంలో కనీసం హోటల్ గది నుంచి మైదానానికి కూడా డేవిడ్ వార్నర్ రాకుండా రూల్స్ విధించింది.

 సన్ రైజర్స్ యాజమాన్యం ఇలా చేయడంపై అందరూ అవాక్కయ్యేలా చేసారు. అయితే ఇటీవలే తనను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. తన మనసులో మాట బయట పెట్టాడు. తనను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణం ఏమిటి అన్నది మాత్రం తనకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం చెప్పలేదు అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడుమ్ కానీ సన్రైజర్స్ యజమానులు అంటే నాకు గౌరవం ఉంది. ఓ నిర్ణయం తీసుకున్నారంటే అందరూ ఏకగ్రీవంగానె తీసుకొని ఉంటారు. ఎవరు నాకు మద్దతిచ్చారు ఎవరూ ఇవ్వలేదు తెలుసుకోలేము కానీ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణం చెప్పక పోవడం నిరాశ కలిగించింది. కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. నా ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. అన్ని మరచి ముందుకు సాగిపోవాల్సిందే అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: