నీ భార్యను రేప్ చేస్తాం.. ఆర్సిబి క్రికెటర్ కు బెదిరింపులు?

praveen
ప్రతి ఐపీఎల్ సీజన్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి చివరికి తడబడుతూ ప్రయాణం చేసి కనీసం ప్లే ఆఫ్ కి అర్హత కూడా సాధించదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. కోహ్లీ కెప్టెన్సీలో ముందుకు సాగుతున్నప్పటికి ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు   ఉన్నప్పటికీ ఐపీఎల్ టైటిల్ అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అందని ద్రాక్షలా గా మారిపోయింది. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ వచ్చినప్పటికీ యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ ఈ జట్టుకు అంతగా అదృష్టం కలిసి రావడం లేదు.  చివరి వరకు బాగా పోరాటం చేసినప్పటికీ ఒక్క అడుగు దూరంలో తడబడుతూ చివరికి ఇంటి బాట పడుతూనే ఉంది ఆర్ సి బి.

 ఇక ఈ సారి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులందరినీ కూడా తీవ్రంగా నిరాశపరిచింది అనే చెప్పాలి. మొదటినుంచి దూకుడుగా ఆడింది కోహ్లీసేన. ఈ క్రమంలోనే ఈసారి గెలవడం ఖాయం అని అనుకున్నారు. అయితే అనుకున్నట్లుగానే ఇటీవల వరుస విజయాలు సాధించి ఏకంగా ప్లే ఆఫ్ కి అర్హత సాధించిన మూడవ జట్టుగా కూడా నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో ఇక తిరుగు లేదని ఈసారి గెలవడం పక్క అని అందరు అనుకున్నారు. అదే సమయంలో ఇక ఇదే కోహ్లీ కెప్టెన్ గా చివరి మ్యాచ్ కావడంతో టైటిల్ గెలిపించి పోతాడు అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మరోసారి ఆర్సిబి తడబడింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి ఇంటి బాట పట్టింది.

 దీంతో అభిమానులు అందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక మరి కొంతమంది అభిమానులు అయితే ఏకంగా హద్దుమీరి ప్రవర్తిస్తూన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సిబి బౌలర్ క్రిస్టియన్ పేలవా ప్రదర్శన చేశాడు. భారీ పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక  క్రిస్టియన్ భార్య గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రెగ్నెంట్ అయిన తన భార్యను రేప్ చేస్తాము అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు క్రికెటర్ క్రిస్టియన్. ఒక క్రికెటర్ గా తాను విఫలం అయితే తన భార్యను ఇందులోకి లాగడం ఏంటి అంటూ వాపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: