టీమిండియాకు కొత్త కోచ్.. ఆయనేనా?

praveen
సాధారణంగా క్రికెట్ జట్టు అద్భుతంగా రాణించడంలో కోచ్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  జట్టుకు ఒక సమర్థవంతమైన కోచ్ ఉన్నప్పుడే జట్టు ఎంతో అద్భుతంగా రాణించి గలుగుతుంది. ఆటగాళ్ల మధ్య స్నేహాన్ని పెంపొందించి.. ఇక డ్రెస్సింగ్ రూమ్ లో కూడా మంచి వాతావరణం ఉండేలా చేయడంలో  కోచ్ కీలకపాత్ర వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలం నుంచి భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా వచ్చిన వారు ఆటగాళ్లను మరింత పటిష్టంగా మార్చడంలో కీలకపాత్ర వహిస్తున్నారు అని చెప్పాలి.



 అనిల్ కుంబ్లే తర్వాత భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా నియమించబడ్డారు రవిశాస్త్రి.  ఇక ప్రస్తుతం రవిశాస్త్రి కోచింగ్ లో అటు టీం ఇండియా  ఎంతో సమర్థవంతంగానే ముందుకు సాగుతుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది.  అయితే మరికొన్ని రోజుల్లో టీమ్ ఇండియా జట్టుకు కొత్త కోచ్ రాబోతున్నాడు. మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ వరల్డ్ కప్ ముగియగానే రావిశాస్త్రి యొక్క కోచ్ పదవి కాలం ముగుస్తోంది.



 ఈ క్రమంలోనే ఇక భారత క్రికెట్ జట్టు కి కొత్త హెడ్ కోచ్ ఎవరు కాబోతున్నారు అనే దానిపై చర్చ మొదలైంది. మొన్నటివరకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీం ఇండియాకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరించడంతో ఇక కాబోయే టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ అని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ కాకుండా కొత్త కోచ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది  రవిశాస్త్రి పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియ బోతోంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ చూస్తుండగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మూడి భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా పదవికి పోటీ చేయబోతున్నారు. మరోసారి ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు టామ్ మూడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: