వామ్మో.. బిర్యానీ బిల్లు 27 లక్షలు?

praveen
ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కి ఊహించని షాక్ తగిలింది అనే విషయం తెలిసిందే. పాకిస్థాన్లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత న్యూజిలాండ్ జట్టు పర్యటన కు వెళ్లేందుకు సిద్ధం అయ్యింది.  పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఇక ఆతిథ్య జట్టుతో వరుసగా సిరీస్లు ఆడాలని నిర్ణయించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే అటు న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు కూడా పాకిస్థాన్ చేరుకున్నారు.  ఇక మరికొన్ని రోజుల్లో పాకిస్థాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కాబోతుంది అనుకుంటున్న తరుణంలో ఏమైందో తెలియదు కానీ.. ఒక్కసారిగా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.


 భద్రతాపరమైన కారణాల దృష్ట్యా తాము పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నాము అంటూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. క్రికెట్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటీవలే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్థాన్లో పర్యటించేందుకు సుముఖంగా లేము అంటూ తెలిపింది.  అయితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోవడానికి ముందు కివీస్ జట్టు ఎనిమిది రోజులపాటు పాకిస్థాన్ లో ఉంది.


 ఇస్లామాబాద్ లోని ఒక హోటల్ లో కివీస్ జట్టు ఆటగాళ్లు బస చేశారు. ఇక ఇలా బస చేస్తున్న న్యూజిలాండ్ ఆటగాళ్లకు రక్షణ కల్పించేందుకు 500 మందికి పైగా పోలీసులు అక్కడ హోటల్ లో విధులు నిర్వహించారు.  ఆ తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు 27 లక్షల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే భద్రత విధులు నిర్వహించిన 500 మంది పోలీసుల బిర్యానీ ఖర్చు ఏకంగా 27 లక్షలు అయినట్లు హోటల్ తెలిపింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ను హోటల్ యాజమాన్యం ఈ బిల్లు కోసం రిక్వెస్ట్ చేయగా.. దీనిని పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: