ఐపీఎల్ కు రోహిత్ శర్మ దూరం.. ఎందుకో తెలుసా?

praveen
మరికొన్ని రోజుల్లో ఇక క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక రెండవ ఫేస్ మొదలవబోతోంది. దీంతో అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పొందేందుకు అటు ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు.  ఎవరు ఈసారి టైటిల్ విజేత గా నిలువ  పోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  ఇప్పటికే ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి కూడా టైటిల్ గెలవ పోతుందా లేదా మూడు సార్లు టైటిల్ గెలిచి ఈసారి కసి మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలుస్తుందా..  లేక కొత్త జట్లు టైటిల్ ఎగరేసుకు పోతాయా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

 ఇకపోతే అటు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు ఎంత దిగ్గజ జట్టుగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ లో దూసుకుపోతుంది.  ఈసారి కూడా ఎంతో విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు జరిగిన మ్యాచులలో పాయింట్స్ టేబుల్ టాప్ లోనే ఉంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇకపోతే ఈ రెండవదశ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు గడ్డుకాలం రాబోతుంది అన్నది అర్థం అవుతుంది. ఎందుకంటే ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుండి నడిపించే రోహిత్ శర్మ ఐపీఎల్ రెండవ దశలో  ఇక ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

 ఎందుకంటే ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఇక ఇటీవలే టీమిండియా ఫిజియో యోగేష్ కి కూడా  వైరస్ సోకింది. అయితే అతడితో  రోహిత్ శర్మ ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక రోహిత్ ఐపీఎల్ ఆడటం కష్టంగానే కనిపిస్తోంది అన్నది అర్థమవుతుంది. సీఎస్కే కెప్టెన్ ధోని కి కూడా భారీ షాక్ తగిలింది. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవీంద్ర జడేజా కూడా టీమిండియా ఫిజియో కోచ్ యోగేష్  కు సన్నిహితంగా ఉన్నాడట. వీరితోపాటు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, చటేశ్వర్ పుజారా లు కూడా ఫిజియో తో కాస్త సన్నిహితంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: