ఐపిఎల్ : ప‌ది సెక‌న్ల యాడ్‌కు ఎంత తీసుకుంటారో తెలుసా.?

Paloji Vinay
ఐపిఎల్ ప‌ది సెక‌న్ల యాడ్‌కు ఎంత తీసుకుంటారో తెలుసా.?
           
         క‌రోనా నేప‌థ్యంలో ఆదాయం ప‌డిపోయిన టీవీ రంగానికి ఆట‌లు ఊపిరిలీదుతున్నాయి.  గ‌తంలో టీవీ యాడ్ రెవెన్యూలో 10 శాతంగా ఉన్న క్రీడ‌ల వాటా ఇటీవ‌ల 20 శాతం పెరిగింది. ముఖ్యంగా భార‌త్‌లో క్రికెట్ కు ఉన్నంత క్నేజ్ మ‌రే ఇత‌ర ఆట‌ల‌కు లేదని చెప్ప‌డంలో సందేహం లేదు. క్రికెట్ మ్యాచ్‌లో  వ‌చ్చే కొన్ని సెక‌న్ల నిడివి ఉన్న అడ్వ‌ర్ట‌యిజ్‌మెంటుకే ల‌క్ష‌ల్లో ఉండ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం అని చెప్పొచ్చు.

    క‌రోనా మొద‌టి ఉధృతి ముగిసిన త‌ర్వాత ప్రారంభం అయిన ఐపీఎల్ ద్వార టీవీ యాడ్ రెవెన్యూ వాటాలో  ఒక్క‌సారిగా 20 శాతం పెరిగింద‌ని ఇంటిగ్నేటెడ్ మీడియా ఆఫ్ అడ్వ‌ర్ట‌యిజింగ్ కంపెనీ డీడీబీ గ్రూప్ ఎండీ రామ్ మోహ‌న్ సుంద‌ర‌మ్ వెల్ల‌డించారు. కొవిడ్ కు ముందు టీవీ యాడ్ రెవెన్యూ రూ.28 వేల కోట్టు ఉండ‌గా అందులో స్పోర్ట్ వాటా రూ.2,500 కోట్టుగా ఉండేద‌ని, ఐపీఎల్ అనంత‌రం ఇది ఏకంగా రూ.4,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వ‌ర‌కు చేరింద‌ని తెలిపారు రామ్ మోహ‌న్‌.
     ప్ర‌పంచ‌క‌ప్‌, టోక్యో ఒలింపిక్ విశ్వ‌క్రీడ‌ల‌కు లేని డిమాండ్ బుల్లితెర పై ఐపీఎల్ కు ఉండ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. క‌రోనా మొద‌టి వేవ్ అనంత‌రం ప్రారంభ‌మై మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఐపీఎల్ 14 సీజ‌న్ సంబంధించి కేవ‌లం ప‌ది సెక‌న్ల యాడ్‌కి రూ.14 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున టీవీలు చార్జ్ చేశాయి. అంటే ఒక సెక‌న్‌కు ల‌క్ష‌కు పైగానే ఉంటుంది. అయినా సరే కార్పొరేట్ కంపెనీలు వెన‌క‌డుగు వేయ‌కుండా టీవీలు అడిగినంత సొమ్మును చెల్లించేందుకు సిద్ద‌మ‌వుతున్నాయి.
       భార‌త్ టీవీ యాడ్ రెవెన్యూలో సీరియ‌ళ్ల‌ది అగ్ర‌స్థానం. ఆ త‌రువాత సినిమాలు, క్రీడ‌లు, న్యూస్‌, మ్యూజిక్ , కిడ్స్ విభాగాలు ఉండేవ‌. కానీ క్ర‌మంగా సీనిమాల‌ను క్రీడ‌లు వెన‌క్కి నెట్టేస్తున్నాయ‌ని పిచ్ మాడిస‌న్ 2019 ప్ర‌కారం తెలుస్తోంది. టీవీ రెవెన్యూలో స్పోర్స్ట్ వాటా 10 శాతంగా ఉంటే సినిమాల వాటా కేవ‌లం 8 శాతంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: