స్పెషల్ పార్టీ.. ఎంజాయ్ చేస్తున్న సీఎస్కే ఆటగాళ్లు?
ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక ఆసక్తికర వీడియోని విడుదల చేసింది. ఇక ఈ వీడియో లో అందరూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఎంతో హుషారుగా సరదాగా గడుపుతున్నారు అన్న విషయం తెలుస్తుంది. అయితే ఇటీవలే ఇక యూఏఈలో ఉన్న సీఎస్కే ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యుల కోసం ఒక ప్రత్యేకమైన వంటకాలు వండారు. అక్కడ ఉన్న ఆ వంటకాలు ఆరగించేందుకు ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకున్నారు
అయితే ప్రస్తుతం ఆటగాళ్లు అందరూ కూడా ఒక హోటల్లో మాత్రమే ఉండాలి అన్న నిబందన ఉంది. హోటల్ దాటి కాలు బయటపెడితే ఏకంగా కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్ల కోసం ఒక ప్రత్యేకత సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం సమయంలో ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సరదాగా భోజనం చేయడానికి ఒక విందు ఏర్పాటు చేసింది. ఇక ఈ విందులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాడు. ఇక ధోని కూతురు జీవా కూడా ఎంతగానో సందడి చేసింది.