టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌ లో కరోనా పడగ.. మరో రెండు కేసులు నమోదు ?

Veldandi Saikiran
కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. పేద మరియు ధనిక అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఈ కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. ఈ కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికే చాలా పడింది. ముఖ్యంగా ఈ ఈ మహమ్మారి బారినపడి నష్టపోయిన వాటిలో ముఖ్యమైనవి చిత్ర పరిశ్రమ మరియు క్రీడా రంగం. ఈ కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడటం, షూటింగ్లు రద్దు కావడం మరియు క్రీడారంగంలో ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో వాయిదా పడటం లాంటివి జరిగాయి. 


ఇక తాజాగా ఈ మహమ్మారి వైరస్ టోక్యో ఒలంపిక్స్  విలేజ్ లో విలయం సృష్టిస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఒలంపిక్స్ విలేజ్లో ఉన్న ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే ఈ టెస్టుల్లో శనివారం రోజున ఆటగానికి కరోనా సోకగా.... తాజాగా ఆదివారం రోజున మరో ఇద్దరు క్రీడాకారులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ ఇద్దరు క్రీడాకారులను హోమ్ ఐసోలేషన్ సెంటర్ కు తరలించింది యజమాన్యం. వరుసగా కేసులు నమోదు అవుతుండటంతో మిగతా క్రీడాకారులు కరోనా టెన్షన్ మొదలైంది. మొత్తం ఈ టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో 11 మంది పాల్గొంటారు.


 జూలై మాసం 23 నుంచి ఈ ఈ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. నేపద్యంలోనే గత వారం రోజులుగా... ఒలంపిక్స్ విలేజ్ లో ఏర్పాటు చేసి... అక్కడే కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు కేసులు వరుసగా బయటపడ్డాయి. దీంతో మిగతా ఆటగాళ్లు కూడా కలవరం చెందుతున్నారు.ఆటగాళ్లతో సహా యాజమాన్యం కూడా కాస్త టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా ఈ టోక్యో ఒలంపిక్స్ పోటీలు జూలై మాసం 23 వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరుగనున్న విషయం మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: