
టీం ఇండియా కు బంపర్ ఆఫర్ ఇచ్చిన దినేష్ కార్తీక్ ?
కోట్లు వసూలు చేసే మెగా టోర్నీని ఐపీఎల్ కూడా ఈ ఏడాది మధ్యలోనే ఆగిపోయింది. వరుసగా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో... ఐపీఎల్ వాయిదా పడింది. ఇది ఇలా ఉండగా... ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు లోనూ కరోనా కలకలం రేపుతోంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తో పాటు టీమిండియా సహాయ సిబ్బందికి కూడా కరోనా సోకింది. అటు మరో వికెట్ కీపర్ మాన్ సాహా కూడా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరు స్పెషలిస్టు కీపర్లు ఐసోలేషన్ లో ఉండటంతో... ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియాకు వికెట్ కీపర్ ఎవరనేది గందరగోళంగా మారింది.
అటు కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నప్పటికీ... అతను ఫుల్ టైం కీపర్ కాకపోవడం మరో బ్యాడ్ లక్. ఈ నేపథ్యంలో టీమిండియాకు దినేష్ కార్తీక్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒకవేళ తనను టీమిండియా కీపర్ గా.... ఆడించాలి అనుకుంటే... తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. అంతేకాదు ఇప్పుడంటే ఇప్పుడు తాను... ఆడటానికి రెడీగా ఉన్నట్లు పేర్కొన్న దినేష్ కార్తీక్... కిట్ బ్యాగ్ మరియు కీపర్ గ్లౌస్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. టీమ్ ఇండియా యాజమాన్యం పిలిస్తే ఏ టైం లో నైనా తాను వాలిపోతాం అని పేర్కొన్నాడు దినేష్ కార్తీక్. అయితే ఇది దీనిపై బి సి సి ఐ ఎలా స్పందిస్తుందో చూడాలి