షాకింగ్ ఘటన : మైదానంలో కుప్పకూలిన ఇద్దరు క్రికెటర్లు?
10 నిమిషాల వ్యవధిలో వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు ఒక్కసారిగా కుప్పకూలి పోవడం సంచలనంగా మారిపోయింది. మొదట వెస్టిండీస్ మహిళా క్రికెటర్ చెనెల్లి హేన్రి కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. అసలు మైదానం లో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత అంతా సర్దుకుని మళ్ళీ ఆట ప్రారంభించారు. ఇక అంతలో మరో ఊహించని ఘటన. వెస్టిండీస్ మహిళా జట్టు లోని మలో ప్లేయర్ చెడియన్ నేషన కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. 10 నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు మహిళా క్రికెటర్లకు కూలిపోవడంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.
ఇక వైద్య సిబ్బంది పరుగున మైదానంలోకి వచ్చేస్తారు. స్ట్రక్చర్ పై ఆ మహిళా క్రికెటర్ ను తీసుకెళ్లారు. అయితే ఇలా ఇద్దరూ క్రికెటర్లు కుప్పకూలి పోవడం తో మైదానంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. క్రికెటర్లు ఎందుకు అలా ఒక్కసారిగా పడి పోయారు అన్న విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.అయితే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఘన విజయాన్ని అందుకుంది. సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వెస్టిండీస్ జట్టు ఇక టైటిల్ గెలుచుకోవడం గమనార్హం.