WTC final : ఇండియా ఓడినా.. ఫ్యాన్స్ బాధపడలేదు.. ఎందుకో తెలుసా?
గతంలో అదే ఇంగ్లాండ్ గడ్డపై వరల్డ్ కప్ ఆడింది న్యూజిలాండ్ జట్టు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేన్ సేన.. ఇక వరుస విజయాలను సాధిస్తూ ఫైనల్కు దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఒక్క సారి కూడా విశ్వవిజేతగా నిలువని న్యూజిలాండ్ ఇక వరల్డ్ కప్ తప్పక గెలుస్తుందని అందరూ అనుకున్నారు. గెలవాలని చాలా మంది కోరుతున్నారు. అయితే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. సూపర్ ఓవర్ కూడా టై అయింది. కానీ కొద్దిలో న్యూజిలాండ్ జట్టు వరల్డ్ కప్ చేజార్చుకుంది.
అయితే ఆ సమయంలో ఇతర జట్ల కెప్టెన్లు అయితే ఇక ఐసీసీ రూల్స్ పై విమర్శలు చేసేవారేమో.. కానీ న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం ఊహించని ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించాడు. ఐసీసీ రూల్స్ పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. అప్పుడే అందరి మనసులో గెలిచాడు కేన్ విలియంసన్ . ఇక ఈసారి తన జట్టుని వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ వరకు తీసుకొచ్చాడు. ఇక తనదైన వ్యూహలతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. అందుకేనేమో అటు టీమిండియా అభిమానులు భారత జట్టు ఓడిపోయినప్పటికీ అంతగా ఫీల్ కాలేదు . గతంలో వరల్డ్ కప్ బ్యాడ్ లక్ ని ఇక ఈసారి కేన్ విలియమ్సన్ జట్టు హార్డ్ వర్క్ బీట్ చేసింది అని ఆనందపడ్డారు.