ధోని సిక్సర్ కి.. గూగుల్ అరుదైన గౌరవం?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు మహేంద్రసింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోనీ అంచెలంచెలుగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచ క్రికెట్లో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఒత్తిడిని చిత్తు చేస్తూ మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇక భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.



 టీమ్ ఇండియా జట్టు కు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ని రెండు సార్లు అందించాడు మహేంద్రసింగ్ ధోని. ఇలా ధోనీ సారథ్యంలో జట్టు ఎంతో విజయవంతంగా ప్రపంచ క్రికెట్లో రాణించింది.  అయితే ముఖ్యంగా ఉత్కంఠగా మ్యాచ్ సాగుతున్న సమయంలో ధోని ఆడే ఆట అందరికీ ఎక్కువగా నచ్చుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఎంత టార్గెట్ వున్నప్పటికీ అలవోకగా జట్టుకు విజయం అందిస్తాడు మహేంద్రసింగ్ ధోని. అందుకే ధోనీని వండర్ఫుల్ ఫినిషర్ అని కూడా అంటుంటారు. ధోని కొట్టే సిక్సర్ల కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.




 అయితే ఇక అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ దేశవాళీ క్రికెట్లో కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే జరిగిన ఐపీఎల్ లో షార్జా స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.  ఇక ఈ మ్యాచ్ చివరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ సిక్స్ కొట్టడంతో బంతి కాస్త స్టేడియం బయట పడింది.  ఇక ఆ ప్రాంతాన్ని ధోని సిక్స్ గా అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇక ఇటీవలే దీనికి  గూగుల్ కూడా అధికారిక ధ్రువీకరణ ఇచ్చింది. దీంతో ధోని సిక్స్ అని గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేయగానే ఆ ప్రాంతం చూపిస్తుంది. దీంతో అభిమానులు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: